ఎంతమంది హీరోయిన్లు వచ్చినా.. అసలు సినిమాలు చేయకున్నా సౌత్ లో సమంతకు క్రేజ్ తగ్గడం లేదు. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చేసిన తర్వాత సమంత తెలుగులో సినిమా చేసింది లేదు. అయినా టాలీవుడ్ ప్రేక్షకులు ఆమె సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత మాత్రం తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టినట్టుంది. అక్కడే వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది. టాలీవుడ్‌లో ‘మా ఇంటి బంగారం’ ప్రకటించింది కానీ ఆ తరువాత ఆ సినిమా ఊసే లేదు.
సౌత్‌లో సమంతకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆమె సినిమాల కోసం టాలీవుడ్‌కే కాక సౌత్ అంతా ఎదురు చూస్తోంది. ఆమెకు కమర్షియల్ ఆఫర్స్ వస్తున్నట్టుగా టాక్. కానీ ఎందుకో ఆమె అంగీకరించడం లేదట. ఆ మధ్య త్రివిక్రమ్ కూడా సమంత ముంబైలోనే ఉండిపోతోందని హైదరాబాద్‌కు రావాలని.. సినిమాలు చేయాలని కోరారు. తన కోసం కథ రాస్తే వస్తానని చెప్పింది కానీ వచ్చేలా కనిపించడం లేదు. పాన్ ఇండియా సినిమా అయితే చేస్తుందేమో కానీ ఆ అవకాశం సమంతకు రావడం లేదని తెలుస్తోంది. ఏదైనా ఫిమేల్ సెంట్రిక్ మూవీ అవకాశం వస్తే తప్ప సమంత సౌత్‌లో సినిమా చేసేలా లేదు.