01-03-2025 10:54:23 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం లోని శ్రీరాజరాజేశ్వర స్వామి జాతర(Sri Bugga Rajarajeshwara Swamy Temple) హుండీ లెక్కింపు ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. గత నెల 25, 26, 27 లలో మూడు రోజులపాటు బుగ్గలో దేవాదాయ శాఖ అధికారులు శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఈసారి జాతరలో లక్షకు పైగా భక్తులు తరలివచ్చి రాజరాజేశ్వరునికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయంలో కానుకల కోసం ఏర్పాటుచేసిన హుండీలను జాతర చివరి రోజున 27న భద్రత కోసం తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాతర పూర్తయి రెండు రోజులు పూర్తయిన హుండీ లెక్కింపు సమాచారం మాత్రం దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించలేదు. కాగా శనివారం దేవాలయం ప్రాంగణంలో హుండీలను లెక్కించనున్నట్లు తెలుస్తుంది. హుండీ లెక్కింపుకు ఒక రోజు ముందుగా సమాచారం అందించాల్సిన దేవాదాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించి శనివారం జాతర హుండీ ల లెక్కింపు కోసం ఏర్పాటు చేపడుతుండడం గమనార్హం.