తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌కు కరువు భత్యం (డీఏ) మంజూరు చేయడంలో తీవ్ర జా ప్యం చేస్తున్నది. ఇప్పటికే సుమారు 5 డీఏలు పెండింగ్‌లో వున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరి 10 నెలలు అవుతున్నా, ఇప్పటికీ ఒక్క డీఏ అయినా ఇవ్వలేదు. దీంతో ఆయా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి తో వున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అం టుతున్నాయి. దీనికి అనునుగుణంగా కరువు భత్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికైనా మరింత జాప్యం చేయకుండా మంజూరు చేయాలి.
కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా