calender_icon.png 4 November, 2024 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు కనడంపై నేను మాట్లాడితే రాద్ధాంతం చేసేటోళ్లు

03-11-2024 01:34:02 AM

  1. ఎక్కువమందిని కనమని చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారు
  2. 24 మందిని మార్చి ఉంటే బీఆర్‌ఎస్ గెలిచేది
  3. మీడియా సమావేశంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గిపోయిందని, అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొ న్నారని.. ఇదే మాట తాను అని ఉంటే పెద్ద రాద్ధాంతమే చేసేవారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

జనాభా ప్రతిపదికన నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందదని వాపోయారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులను మార్చి ఉంటే కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేవారని తెలిపారు.

వారి తప్పిదాల కారణంగానే ఓడిపోయారని అన్నారు. అప్పుడు అహంకారానికి మరోపేరుగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరించారని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ కూడా ప్రణాళిక రచించిదని, అప్పుడు తాను వద్దని వారించినట్లు గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే తాను నోరు విప్పాల్సి వస్తుందని.. అప్పుడు బీఆర్‌ఎస్ వాళ్లు ఇబ్బందులు పడతారన్నారు.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ మద్దతుతోనే బీఆర్‌ఎస్‌కు అధిక సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన మూసీ శుద్ధీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఇండ్లను కూల్చకుండా ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. హిందువులకు సంబంధం లేని వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌లోకి ముస్లిమేతరులకు ఎలా స్థానం కల్పిస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీలో పనిచేసేందుకు అన్యమతస్తులను నిరాకరిస్తున్న ప్పుడు వక్ఫ్ విషయంలోనూ అలాగే వ్యవహరించాలని కోరారు.