పెద్దపల్లిలో పట్టాలపై మూడు నెలల పసి బాలుడు...
బాలుని చూసి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్న రైల్వే పోలీసులు..
పెద్దపల్లి (విజయక్రాంతి): మానవత్వం మంట కలిసినవేళ అంటే ఇదేనేమో... పెద్దపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో కూనారం రైల్వే ట్రాక్ వద్ద పట్టాలపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు మూడు నెలల పసి బాలుడిని వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలుని చూసి, మానవత్వంతో పరుగు పరుగున పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి, మానవత్వం చాటుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పసి బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. స్థానికులు పసి బాలుడి విషయం తెలుసుకొని పెద్దపల్లి పట్టణంలో వదిలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు.