calender_icon.png 17 November, 2024 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

29-06-2024 01:58:20 AM

30 తులాల బంగారం, 50 తులాల వెండి నగలు చోరీ

ఎల్బీనగర్, జూన్ 28(విజయక్రాంతి) : అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు. తాళం వేసి ఉన్నదని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన బంగారు, వెండి నగలను దోచుకెళ్లారు. హయత్‌నగర్‌లో కలకలం రేపిన ఈ సంఘటన ప్రియదర్శిని కాలనీ ఫేజ్  రోడ్డు నంబర్  జరిగింది. వివరాల్లోకి వెళితే... పసుపులేటి స్వాతి, రాజు దంపతులు రోడ్డునంబర్ 6లో గల ఓ ఇంట్లో ఉంటున్నారు. రాజు వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లాడు. స్వాతి ఒక్కతే ఇంట్లో ఉంది. గురువారం సాయంత్రం తన స్నేహితురాలు మృతిచెందిందని ఇంటికి తాళం వేసి వెళ్లింది.

అంత్యక్రియలకు హాజరై శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. గేటు తీయగానే ఇంటి తాళం పగులకొట్టి ఉంది. భయంతో ఇంటి పక్కన వారిని పిలిచింది. లోపలికి వెళ్లి చూడగా.. బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తాళం తీసి ఉంది.  వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేశారు. బీరువాలో 30 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు స్వాతి గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.