calender_icon.png 30 October, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీల నియంత్రణ ఎప్పుడు?

29-10-2024 12:00:00 AM

ఇసుక లారీలు ప్రజల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబటిపల్లి సమీపంలో ఇసుక లారీ ఢీకొనగా, టూవీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. అదేరోజు పెద్దాపూర్ సమీపంలో ఇసుక లారీ ఢీ కొని ఇద్దరు మరణించారు. ఈ ఇసు క లారీల ప్రమాదాలకు అంతు లేకుండా పోతున్నది. మరోవైపు కోట్లాది రూపాయలతో వేయించిన రోడ్లు లారీలవల్ల ధ్వంసమ వుతున్నాయి.

ఈ వాహనాల డ్రైవర్లు, యజమానులు నియమ నిబంధనలు ఉల్లంఘి స్తున్న కారణంగానే ఈ పర్యవసానాలు సంభవిస్తున్నాయి. ఎక్కువమంది డ్రైవర్లు మద్యం సేవించి లారీలు నడిపి అమాయకుల చావుకు కారణమవడం బాధాకరం. 

రోడ్లమీద ఇసుక లారీలు కనిపిస్తే ప్రజలు భయపడి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ప్రజలు పలుమార్లు రోడ్డు, రవాణా శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు లారీ ప్రమాదాల గురించి విన్నపాలు చేసినప్పటికీ నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప, పూర్తిస్థాయిలో వాటిని నిలువరించ డం లేదు. రహదారులకు ఇరు పక్కల, క్రాసింగ్‌ల వద్ద హెచ్చరికల బోర్డులు, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సూచికలను ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెద్ద స్పీడ్ బ్రేకర్‌లను నిర్మించాలి.

అధికారులు, పోలీసులు నిరంతరం పర్యవేక్షణ జరపాలి. ఆర్టీసీ బస్సులకు లారీ డ్రైవర్‌లు దారి ఇవ్వక పోవడం వల్ల ప్రయాణీకులు సకాలంలో గమ్యస్థానాలకు చేరడం లేదు. రహదారులపై ప్రధానంగా మూల మలుపు లవద్ద పంక్చరైన వాహనాలను నిల్పకుండా చూడాలి. అధికారులు ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. 

 -కామిడి సతీశ్‌రెడ్డి