- రెండు నెలల ఆలస్యంగా టెండర్లు
- చేపల వృద్ధిపై మత్స్యకార్మికుల్లో ఆందోళన
- నిర్మల్ జిల్లాలో 214 సంఘాలు, 13,613 మంది సభ్యులు
నిర్మల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎట్టకేలకు చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఖరారయ్యాయి. మత్స్యకార్మి కుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపపిల్లలను 100 శాతం స బ్సిడీ కింద ఏటా పంపిణీ చేస్తున్నది. సమగ్ర మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 202 4 సంవత్సరానికి జిల్లాకు 5.24 కో ట్ల చేప పిల్లలను విడుదల చేయాలని జిల్లా మ త్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. జిల్లాలో మొత్తం 214 మత్స్య కార్మిక సంఘాలు ఉం డగా 178 పురుషుల సంఘాలు, మిగిలినవి మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉ న్నాయి. మొత్తం 13,613 మంది మత్స్య కా ర్మికులు సభ్యులుగా ఉండగా మరో 7,000 పరోక్షంగా ప్రయోజనం పొందనున్నారు.
584 చెరువుల్లో చేప పిల్లలు..
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, గడ్డెన్న వాగు, స్వర్ణ, కడెం నారాయణరెడ్డి, పత్సి రంగారావుకర్ ప్రాజెక్టులతో పా టు 584 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు అధికారులు టెండర్లు పూర్తి చేశారు. ముగ్గురు టెండర్లు దక్కించుకున్నా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం ఇంకా నిర్దిష్టమై న తేదీని ప్రకటించకపోవడంతో పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నది. దీంతో మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల ఆలస్యంతో చేపల వృద్ధిపై ప్రభావం
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో చేప పిల్లలను త్వరగా విడుదల చేయాలని మత్స్య కారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏటా జూన్‌లో టెండర్లు ఆహ్వానించి జూలై లేదా ఆగస్టు మొదటి వారంలోనే చేప పిల్లలను పంపిణీ చేసేది. ఈసారి రెండు నెలలు ఆల స్యం కావడంతో మత్స్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇది చేపల వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు.
వెంటనే చేప పిల్లలను పింపిణీ చేయాలని కోరుతున్నారు. జనవరి వరకు చెరువులు, ప్రాజెక్టుల నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చే యనుండటంతో అందులోని నీటి సామర్థ్య ం తగ్గి చేప పిల్లల వృద్ధిచెందే అవకాశం తక్కువగా ఉంటుందని మత్స్యకార్మికులు అంటు న్నారు. కనీసం కేజీన్నర ఉండాల్సిన చేపలు కేజీలోపు బరువు ఉంటే తమకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని వాపోతున్నారు. టెండరుదారులకు ప్రయోజనం కోసమే ఆలస్యం చేశారని ఆరోపిస్తున్నారు.
మూడు రకాల చేప పిల్లలు
జిల్లాలో 5 సాగునీటి ప్రాజెక్టులతో పాటు 584 చెరువుల్లో చేప పిల్లలను వి డుదల చేయనున్నారు. ప్రభుత్వం 5.24 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనుండగా ఇందులో మూడు రకాల చేప పిల్ల లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి నీటి మట్టం ఉన్న చెరువుల్లో 40 రోజుల వయస్సున్న 35 నుంచి 40 మి.మీ.ల పొడవున్న చేప పిల్లలను విడుదల చేస్తా రు. ఏడాది మొత్తం నీరు ఉండే ప్రాజెక్టు ల్లో 70 రోజుల వయసున్న 80-100 మీ.మీ.ల పొడవున్న చేప పిల్లలు విడుద ల చేస్తారు.
చేప పిల్లలు పెరగాలంటే 6 నె లల సమయం పడుతుంది. ఆగస్టు మొ దటి వారంలో చేప పిల్లల విడుదల పూర్తి అయితే ఫిబ్రవరి వరకు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు వచ్చేవి. ప్రస్తుత ం చేప పిల్లల విడుదల రెండు నెలలు ఆలస్యం కావడంతో మార్చి, లేదా ఏప్రిల్ వరకు ఎదిగే అవకాశముంది.
చేప పిల్లలు వెంటనే విడుదల చేయాలి
చేప పిల్లలను పంపిణీ ని ఆలస్యం చేయడంతో అవి పిల్లలు పెరిగే అవకాశం లేదు. రెం డు నెలల నుంచి చేప పిల్లల విడుదల కో సం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం టెం డర్ల పక్రియ పూర్తి చేసినందున చేప పిల్లలను వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. చెరువుల్లో నీళ్లు తగ్గితే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది.
భోజన్న, మత్స్యకార్మికుడు
ఆరోగ్యమైన చేప పిల్లలివ్వాలి
ఆరోగ్యవంతమైన చేప పిల్లలను సరఫరా చేయాలి. టెండర్ల పక్రియ లేటు కావడంతో ఉన్న నీటిలో చేపలు పెరగాలటే ఆరోగ్యంగా ఉన్న పిల్లలను మాత్రమే సరఫరా చే యాలి. గతంలో టెండరుదారులు సరఫ రా చేసిన చేప పిల్లలు చెరువుకు వచ్చేటప్పటికి చనిపోయాయి. అటువంటి వాటి పై అధికారులు దృష్టిపెట్టాలి.
నర్సయ్య,
మత్స్యకార్మికుడు, అందకూర్