calender_icon.png 15 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేలపై ట్రామా సెంటర్లు ఎప్పుడు?

11-10-2024 12:00:00 AM

తెలంగాణ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రెట్టింపు మంది క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ అయిన మొదటి గంటలో వైద్యమందిస్తే ప్రాణాపాయంనుంచి తప్పించవచ్చని, ఇందుకోసం ట్రామాకేర్ సెంటర్లు దోహదపడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వీటి ప్రాధాన్యతను రాష్ట్రప్రభుత్వం గుర్తించి జాతీయ రహదారులపై ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కూడా. అయితే అవి కార్యరూపంలోకి రాలేదు. ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు శ్రీకారం చుడితే వందలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు వీలు ఏర్పడుతుంది.            

 మా.శ్రీ రాజు, పాల్వంచ