calender_icon.png 3 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు ఎన్నడో?

29-03-2025 12:00:00 AM

  • పడకేసిన పారిశుద్ధ్యం, అభివృద్ధి 

తాగు నీటి సమస్యతో అల్లాడుతున్న గ్రామాలు 

కల్లూరు, మార్చి 28:-రాష్ట్రంలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు లేకపోవడం వల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోక దీనస్థితిలో ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది.మరో వైపు వేసవి కావడం తో నీటి ఎ ద్దడితో గ్రామాలు తల్లడి ల్లుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది.

ఒక ఇంటికి యాజమని లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో అలా ఉంది ప్రతి గ్రామం పరిస్థితి. నీళ్లు లేకపోతే ఎవరిని అడగాలి. తాగునీరు బోర్లు చెడిపోతే ఎవరిని అడగాలి.సమస్యల పరిష్కారానికి కృషి చేసేది ఎవరని ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు.పంచాయతీలో నిధులు లేక స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శులు పెనుబారం మోయలేక అష్ట కష్టాలు పడుతున్నారు.

కొన్ని పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలు అడుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపలేక మొఖం చాటేసుకొని తిరుగుతున్నారు.ఇంకా ఎన్ని నెలలు సర్పంచ్ ఎలక్షన్ కోసం ఎదురు చూడాలని అటు ప్రజా ప్రతినిధులు ఇటు ప్రజలు నిరుత్సాహ భావం తో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిపితే కానీ గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. ప్రభుత్వం సత్వరమే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.