హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. భారాస తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కూనం వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై గురువారం జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ స్పీకర్‌కు గడువు నిర్దేశించే అధికారం కోర్టుకు లేదన్నారు.
స్పీకర్‌కు పిటిషన్లు అందజేసిన వెంటనే హైకోర్టుకు వచ్చారన్నారు. అంత హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. గతంలో ఇదే తరహాలో టీడీపీ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ బీఆర్‌ఎస్‌లోకి చేరినప్పుడు దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నారు. ఇటీవల హిమచల్‌ప్రదేశ్‌లో చీఫ్ జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం కూడా స్పీకర్‌కు నోటీ సులు ఇవ్వలేమని తేల్చి చెప్పిందన్నారు.
దీనిపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, రామచంద్ర రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యేలపై అనర్హత వేటు వేయని పక్షంలో ఇలాం టివి కొనసాగుతూనే ఉంటాయన్నారు. ప్రభుత్వం కావాలని గడువు తీసుకుంటూ వాయిదా కోరుతున్నారన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలం టూ తాము శాసనసభ కార్యాలయ కార్యదర్శిని వివరణ అడుగుతున్నామన్నారు. తమ ముందున్న పిటిషన్లను తేల్చడమే ప్రధాన ఉద్దేశమని, అందరూ కోర్టులను తప్పుబడుతున్నారన్నారంటూ తదుపరి విచారణను 22కు వాయిదా వేశారు.