12-03-2025 12:52:11 AM
మంథని, మార్చి 11 (విజయక్రాంతి): దశ్శబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల కల రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో నెరవేరింది. మంథని నియోజకవర్గం లోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుండి భూపాలపల్లి వయా తాడిచెర్ల మీదుగా డబుల్ రోడ్డుకు రూ. 33 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతోపాటు మంత్రి అటవీ శాఖ అనుమతులు కూడా తీసుకువచ్చారు.
గతంలో ఖమ్మంపల్లి నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో అటవీ శాఖ అనుమతులు కూడా లేకపోవడంతో పాటు రోడ్డు పనులు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని భూపాలపల్లి వరకు రోడ్డు నిర్మాణంతో పాటు అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చి, నిధుల కోసం ప్రత్యేకంగా మంగళవారం జీవో నెంబర్ 113 ద్వారా రూ. 33 కోట్ల 70 లక్షలు నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించారు.
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి నుండి భూపాల్ పల్లి వరకు వయా తాడిచర్ల మీదుగా రోడ్డు భూపాలపల్లి జిల్లాకు తాడిచెర్ల నుండి 42 కిలోమీటర్ల దూరం ఉంటే, ఈ నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు ద్వారా దాదాపు 20 కిలోమీటర్ల లోపే ప్రయాణించవచ్చు.
ఈ రోడ్డును) మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కు మలహర్ రావు మండలంలోని తాడిచెర్ల తో పాటు ముత్తారం మండలంలోని సీతంపేట ,ఖమ్మం పల్లి అన్ని గ్రామాల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు కు గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.