25-03-2025 10:25:29 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): రోటరీ క్లబ్ కామారెడ్డి చేత రైల్వేస్టేషన్ కామారెడ్డికి ఉచిత వీల్ చైర్ ను మంగళవారం అందజేశారు. దాత రొటేరియన్ సుభాష్ చంద్ జైన్ బోహర రైల్వేస్టేషన్ లో వృద్ధ వికలాంగుల ప్రయాణికులను తరలించేందుకు అందించారు. ఈ కార్యక్రమములో రోటరీ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ... కామారెడ్డి రైల్వేస్టేషన్ లోని వృద్ధ, వికలాంగ ప్రయాణికుల సౌకర్యార్థం కొరకై దాత సుభాష్ చంద్ జైన్ దాదాపు 10,000/- రూపాయల విలువగల వీల్ చైర్ ను ఉచితంగా అందించడం సంతోషకరమని రోటరీ క్లబ్ అనేక ప్రజాసేవ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమ సేవలందిస్తుందని, విద్యా, వైద్య మొదలైన అనేక రంగాల్లో రోటరీ క్లబ్ తమ వంతు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రొటీరియన్స్ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్. ఎం. జైపాల్ రెడ్డి, ధనంజయ, శ్రీశైలం, డాక్టర్ బాలరాజ్, సుధాకర్ రావు, నాగభూషణం, చంద్రశేఖర్ కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారికి సబ్బని కృష్ణ హరి, శంకర్, రైల్వే స్టేషన్ మాస్టర్ వి. సత్యం, మనోజ్ కుమార్ లు పాల్గొన్నారు.