calender_icon.png 23 January, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోధుమ గడ్డి జ్యూస్.. ఆరోగ్యానికి జోష్

23-01-2025 12:00:00 AM

గోధుమ గడ్డి రసం సర్వరోగానివారిణి. ఇందులో శరీరానికి కావాల్సిన  విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, సి, ఇ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వడంలో సహాయపడతాయి. 

గోధుమ గడ్డి రసంలో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఎర్ర రక్త కణాలు శరీరమంతా ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పికి కారణమవుతుంది. గోధుమ గడ్డి రసంలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. క్లోరోఫిల్ రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ జంక్ ఫుడ్ తింటున్నారు. జంక్ ఫుడ్‌తో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వాళ్లు ప్రతిరోజు ఉదయం ఈ గోధుమ గడ్డి రసం తాగితే కడుపులో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నింటినీ తొలగించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది.  

గోధుమ గడ్డి రసం శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.