26-04-2025 07:21:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన 1912 టోల్ ఫ్రీ నంబర్ తో పాటుగా కొత్త ఫీచర్ "వాట్సాప్ చాట్ బాట్" ను అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్మల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం(Circle Superintending Engineer Sudarshanam) తెలిపారు. ఇందులో మొదటగా వినియోగదారులు తమ మొబైల్ నుండి వాట్సాప్ లో 7901628348 నంబర్ కు హాయ్ అని చాట్ చేయగానే హాయ్ TGNPDCL కాల్ సెంటర్ కు స్వాగతం అని వచ్చి అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది.
అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుంది. ఇలా విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుని విద్యుత్ సర్వీస్ వివరాలు వస్తాయి. ఇలా వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్ కు సంబంధించిన వివిధ రకాలు సవివరంగా మెనూ లో కనపడుతాయి. అందులో కంప్లైంట్ కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. ఇలా ఏజెంట్ తో చాట్ చేయవచ్చు లేదా కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. కంప్లైంట్ ఐడి తో ఒక నంబర్ జెనెరేట్ అయ్యి మీ ఫిర్యాదు నమోదు చేయబడుతుంది.
తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారికి నివేదించబడిందని అని వినియోగదారునికి సమాచారం రూపకంగా మెసేజ్ వెళ్తుందని తెలిపారు. అలా భవిషత్తులో కంప్లైంట్ ఐడి తో వినియోగదారుని సమస్యను ట్రాక్ చేసుకోవచ్చని చెప్పారు. కంప్లైంట్ పూర్తి అయ్యిన పిదప వినియోగదారునికి సమాచారంతో పాటు IVRS ద్వారా కాల్ వెళ్తుంది. అలాగే సమస్య పరిష్కరించిన తర్వాత ఫీడ్ బ్యాక్ ఇవ్వమని అడుగుతుంది లేదా సంతృప్తి చెందని యెడల మరల కంప్లైంట్ రిఓపెన్ చేయమని అడుగుతుందని చెప్పారు. అలాగే www .tgnpdcl .com వెబ్ సైట్ లో "వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందని ఆ ఐకాన్ క్లిక్క్ చేసుకొని చాట్ చేయవచ్చని చెప్పారు. వినియోగదారునికి ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకుని సత్వర విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ చాట్ బాట్" ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి సేవలు పొందగలరని కోరారు.