calender_icon.png 26 October, 2024 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతులకు వాట్సాప్ సేవలు

26-10-2024 01:09:38 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి రైతులు త మ  పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని వాట్సాప్ సేవలను మార్కెటింగ్ శాఖ శుక్రవారం ప్రారంభిం చింది. 8897281111 నెంబర్ ద్వారా రైతు లు కొనుగోలు సంబంధిత పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల తనిఖీల పట్టి వివరాలు, చెల్లింపుల స్థితి, సీసీఐ కేంద్రాల్లో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు, తదితర అంశాలను రైతులు తమ ఇంటి వద్ద ఉండి వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు తెలిపారు.

పత్తిలో తేమ 12శాతం మించకుండా ఉండి 8 శాతం నుండి 12శాతం మధ్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లబిస్తుందని, తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్ధారించుకున్న తరువాతనే  కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని సూచించారు.

పత్తి సీజన్‌లో రైతులు పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. రైతులంతా వాట్సాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని కోరారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా  మార్కెటింగ్ శాఖ అధికారులు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.