calender_icon.png 26 October, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు పక్షవాతం వచ్చిందని వీడియో ఏంటి?

26-10-2024 12:00:00 AM

చిన్న నటీమణుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు సోషల్ మీడియా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుంటే కుదరదు. ఈ క్రమంలో తమపై వస్తున్న కామెంట్స్ యూట్యూబ్ వీడియోలు కంట పడుతూనే ఉంటాయి. వాటిని చూస్తే ఒకింత ఆవేదన, ఆగ్రహం కలగలిపి వస్తాయి. తాజాగా ఆలియా భట్ సైతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

అయితే ఆమె తన శరీరం, మాట్లాడే విధానంపై అసభ్య కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “సోషల్ మీడియాలో షేర్ అవుతున్న నా వీడియో చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపి స్తోంది. నా నవ్వు వంకర, మాట్లాడే విధానం భిన్నం.. అందం కోసం సర్జరీ చేయించుకున్నానంటూ వీడియోను క్రియేట్ చేశారు. పైగా నాకు పక్షవాతం వచ్చిందనీ ఆ వీడియోలో పేర్కొన్నారు.

అసలు ఎలాంటి నిర్ధరణ లేకుండా ఇలాంటి రూమర్స్ సృష్టించడం నేరమని మీకు తెలియదా? కేవలం వ్యూస్ కోసం ఇలా చేస్తారా? పైగా ఇలాంటి వీడియోలు సృష్టించే వారిలో ఆడవారు సైతం ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి పనులు ఏమాత్రం మంచివి కావు” అని ఆలియా పేర్కొన్నారు. తాజాగా ఆలియా ‘జిగ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెపై ట్రోల్స్ మరింత పెరిగాయి.