24-02-2025 12:00:00 AM
ఆత్మీయ కరచాలనం
అభిమానంతో ఆలింగనం
సరదాగా సంభాషణం
కలుసుకోవడం మురిసిపోవడం
ఏదీ లేనప్పుడు
ఎన్ని లక్షల వ్యూలు,
లైకులు, కామెంట్లు
ఎన్నొస్తే ఏమిటి
ఎన్నుంటే ఏముంది
...
వన్ బై టు చాయ్
సగం సగం సిగరెట్టూ
గుండెల్లో దమ్ము
స్నేహంలో ఆప్యాయత
ప్రేమలో నిజాయితీ
లేనప్పుడు
సామాజిక మాధ్యమాల్లో
ఎన్ని అకౌంట్లు ఉంటేముంది?
...
వర్తమాన
సమాజాన్ని చూడలేనప్పుడు
నిజమైన
మనిషిని పలకరించలేనప్పుడు
ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తేముంది?
ఎన్నింటిని
కన్ఫర్మ్ చేస్తే మాత్రమేముంది?
క్షణం చూడడం
మరు క్షణం
స్క్రోల్ చేయడమే కదా
వాట్ నెక్ట్స్..
తర్వాతేమిటి?