calender_icon.png 19 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశ్మీర్‌లో కొత్తందాలు

17-01-2025 12:00:00 AM

నేలపై వెలసిన అద్భుత అందాల స్వర్గం మన కాశ్మీరం. సకల అందాల కాశ్మీరంలో ప్ర తికూల వాతావరణాలు, ప్ర మాదకర కొండలు, లోయ లు, కొండచరియలు విరిగిపడడం లాంటి ప్రకృతి ప్రకోపా లు నిత్యకృత్యం కావడంతో ప్రజలు నలిగిపోతున్నారు. అలాంటి జమ్ము,-కాశ్మీర్‌కు నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధులకు, పర్యాటకుల కనువిందులకు, త్రివిధ దళాల సురక్షిత ప్రయాణాలకు మార్గం సుగమం అవుతున్నది.

సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ప్రతిష్టాత్మకంగా రూ:42,000 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర ప్రభు త్వం చేపట్టిన రోడ్డు మార్గాలతో పాటు రైలు మార్గాల్లో వంతెనలు, సొరంగ మార్గాలు, రోప్‌వేస్ నిర్మాణాలతో ఆ ప్రాంత రవాణా అత్యంత సురక్షితం, సులభం కానున్నది. ఇప్పటికే 41,141 కి.మీ రోడ్ల నిర్మాణంతో (అందులో 1,735 కి.మీ జాతీయ రహదారి) పాటు 410 వంతెనలు కూడా పూర్తి చేయడం జరిగింది.

ఇప్పటికే జమ్మూ, కశ్మీర్ ప్రాంతంలో 17,839 కి. మీల రోడ్డు నిర్మాణాలతో 2,131 గ్రామాలను కలపడం జరిగింది. పర్వత మాలా పథకం కింద 18 రోప్‌వే ప్రాజెక్టులను కూడా చేపట్టడం జరిగింది. ‘దేవుడి గడ్డి మైదానం’గా పేరొందిన సోన్‌మార్గ్ వద్ద నిర్మించిన జెడ్-మోర్ సొరంగ మార్గంతో కాశ్మీర్-లేహ్ కార్గిల్‌ల మధ్య రోడ్డు మార్గం సులభం అవుతుంది.

సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తున 12 కి.మీ సోన్‌మార్గ్ టన్నెల్ ప్రాజెక్టు రూ.2,700 కోట్ల బడ్జెట్‌తో పూర్తి కావడం, ప్రారంభోత్సవం కూడా జరగడం సంతోషదాయకం. భరతమాత కు కిరీటంగా నిలబడిన కాశ్మీర్ నేటి అత్యాధునిక ప్రాజెక్టులు పూర్తి కావడంతో దాని అందాన్ని మరింత ఇనుమ డింపజేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇవి మన ఇంజనీరింగ్ నిపుణుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాత్రాబనిహల్ ప్రాంతాలను కలిపే 11 కి.. మీ రైలు మార్గాన్ని సుగమం చేయడానికి రియసీ జిల్లాలో చీనాబ్ నదిపై వంతెన నిర్మాణం పూర్తి అయ్యింది.

1,178 అడుగుల ఎత్తున నిర్మించిన 1.3 కిమీ పొడవైన ఈ రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తునదిగా చెబుతున్నారు. ఈ వంతెనలు, సొరంగ మార్గాలు, రోప్‌వేలతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అన్ని సీజన్లలో పర్యాటకులకు ఆహ్వానం పలకడంతో పాటు తక్కువ సమయంలో సురక్షిత ప్రయాణాన్ని అందించనున్నాయి. 

 డా.బుర్ర మధుసూదన్ రెడ్డి