19-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్18 ( విజయక్రాంతి): అదో గిరిజన గ్రామం.. నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలోని ఆదివాసీలకు గుండెల్లో గుబులు మొదలైం ది. గ్రామానికి ఏదో తెలియని పీడ ఆవహించిందని ఆదివాసి గిరిజన కుటుంబాలు వేరే గ్రామానికి వలస వెళ్లి జీవిస్తున్నారు.
ఆసిఫాబాద్ మండలం సమతులగుండం గ్రామంలో 13 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు ఆత్రం రాజు, సోను బాయి దంపతుల తో పాటు వారి కుమారులు బీము, మారుతి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మిగ తా కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
గ్రామంలో ఏదో పీడ వచ్చిందని మూఢనమ్మకంతో 11 కుటుంబాలు లింగాపూర్ మం డలం భీమన్ గొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్దకు చేరి అక్కడే ఉంటున్నారు. ఒక కుటుంబం మాత్రం సమతుల గుండం వద్దే ఉంటూ తమ చావైన, బ్రతుకైనా ఇక్కడే ఉంటుందని ఎంతో ధైర్యంతో ఉన్నారు. వల స వెళ్లిన కుటుంబాలు మాత్రం ఆ గ్రామానికి వెళ్ళమని ఇక్కడ జీవనం కొనసాగించుకునేందుకు ఏర్పాటు చేసుకుంటామని చెబు తున్నారు.
జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో..
సమతుల గుండం జిల్లా కేంద్రానికి కేవల ం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ గ్రామానికి 8 కిలోమీటర్ల మేర రోడ్డు సౌక ర్యం లేకపోవడంతో పాటు మార్గమధ్యంలో వాగు కూడా ఉంది. చుట్టూ అడవులు మధ్య లో ఎంతో అప్లహాదా కరమైన ప్రకృతి ఒడి లో ఆ గ్రామం ఉంటుంది. గ్రామ సమీపం లో వర్షాకాలంలో జలజల పారే జలపాతం సందడి చేస్తుంది.
గ్రామానికి రవాణా సౌక ర్యంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టి గిరిజనుల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతై నా ఉంది. ఒకే కుటుంబంలో నలుగురు నెలరోజుల వ్యవధిలో అనారోగ్యంతో మృతి చెందడంతో గిరిజనులు భయాందోళన మొదలైంది.
ఆదివాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మెరుగైన వైద్యం అందించాలి.
మేము ఇక్కడే ఉంటాం..
మా ఊర్లో నలుగురు చనిపోవడంతో ఇక్కడ బతుకుతున్న వారందరూ భయంతో ఇండ్లు ఖాళీ చేసి పక్క ఊర్లో ఉంటున్నారు. నేను ,నా పిల్లలు ,భార్య ,నా తమ్ముడు మాత్రం ఇక్కడే బ్రతుకుతాం. బ్రతికేందుకు ఇక్కడ అవకాశం ఉంది వేరే ఊరు వెళితే బతకడం చాలా కష్టం అవుతుంది అందుకే ఇక్కడ మాకు ఏమైనా పర్వాలేదు. మా తాతల కాలం నుండి ఉంటున్న సమితలగుండంలోనే మా బ్రతుకైనా, చావైనా ఇక్కడే జరగాలి.
- ఆత్రం వినాయక్ రావు,
సమతుల గుండం