calender_icon.png 27 October, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా ఒప్పందంతో జరిగేదేంటి?

27-10-2024 01:33:14 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్ మధ్య గల సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా తాజాగా కీలక ముందడుగు పడింది. 2020 తర్వాత జరిగిన ఘర్షణల కారణంగా రెండు దేశాలు సరిహద్దు వెంట భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఫలితంగా అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే భారత్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మోహరించిన అదనపు బలగలాను ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపాయి. ఈ ప్రాంతంలో తిరిగి పెట్రోలింగ్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకొంటాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న క్లిష్టమైన సమస్యల్లో 75శాతం సమస్యలకు పరిష్కారం దొరికింది. మిగిలిన వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాజా చర్చల వల్ల తూర్పు లడక్ ప్రాంతంలో 2020 ముందు నాటి పరిస్థితులు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

1962లో మొదలైన సమస్య

భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం నుంచి భారత భూభాగాలను చైనా ఆక్రమించడం మొదలు పెట్టింది. డెమ్‌చోక్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా లడక్‌లోని ఎల్‌ఏసీకి దక్షిణాన ఉన్న భారత భూభాగం. ఈ ప్రాంతంలోని ఓ గ్రామాన్ని యుద్ధం సమయంలో చైనా బలగాలు ఆక్రమించాయి. అనంతరం అక్కడ భారత నిర్మాలను చైనా అడ్డుకుంది. ఆక్సాయ్‌చిన్, గాల్వాన్ లోయలో వివాదాలు సృష్టించింది. 

2020లో తీవ్రమైన ఘరణలు

లడఖ్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌ను అనుసంధానం చేస్తూ  గాల్వాన్ లోయ నుంచి రోడ్డు నిర్మాణ పనులను భారత్ ప్రారంభించింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతాయని చైనా భావించి పనులను అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే 2020 జూన్‌లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య గొడవ జరగ్గా 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం రెండు దేశాల సరిహద్దు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇరు దేశాలు సరిహద్దు వెంట భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించాయి.

21 సార్లు కమాండర్ స్థాయి చర్చలు

2020లో మొదలైన ఘర్షణలను తగ్గించడానికి ఇరు దేశాలకు చెందిన సైనికాధికా రులు 21 సార్లు చర్చుల జరిపారు. ఈ ఘర్షణలకు ఇప్పుడు ముగింపు దొరికింది. మోదీ బ్రిక్స్ సమావేశాలకు వెళ్లడానికి ముందు రోజు సరిహద్దుల్లోని అదనపు బలగాలను ఉపసంహరించుకోవడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ ఒప్పందం అమలులోకి వస్తే తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి మోహరించిన అదనపు సైన్యం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే లడఖ్ ప్రాంతంలో 2020 నాటి ముందు పరిస్థితులు ఏర్పాడతాయి.