18-12-2024 12:00:00 AM
మొత్తానికి మనకు ఒక రాజ్యాంగం ఉందని తేలిం ది. కేవలం సుప్రీంకోర్టు తీర్పుల్లో, పార్లమెంట్ రాజ్యాంగ సవరణలలో, పత్రికల లో పొరబాటున ఎవరైనా రాస్తే తప్ప రాజ్యాంగం అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. పూర్తిగా చదివారో లేదో తెలియదు. మన రాజ్యాంగ నిర్మాతబీఆర్ అంబేద్కర్ దేశానికి దారి చూపిస్తూ ఉంటారు, కాని చూసే వారెంతమంది. అట్లాగే భారత రాజ్యాంగం అని పేరులో కనపడేవిధంగా అంబేద్కర్ విగ్రహాల్లో ప్రతి చేతిలో కనిపిస్తూ ఉంటుంది.
కానీ విగ్రహం వలెనే రాజ్యాంగం తెరిచి చదవలేడు. కాని ఒక్కో అక్షరం, ఆర్టికల్, అధ్యా యం, భాగం, షెడ్యూలు చదివి చదివి, వివరించి, విశ్లేషించి, విభేదించి, వాదించి, 60 శాతం పైగా వ్యతిరేకులు తిట్టినా, గెలిపించి, రాజ్యాంగాన్ని దాని ప్రజారాజ్యాన్ని రక్షించిన వాడాయన. రోడ్డుమీద పెద్ద స్టూల్ మీద నిలబడి, విన్నా వినకపోయినా బైబి ల్ అరుస్తూ చెబుతున్నట్టు, రాజ్యాంగాన్నిచదివేవాడుంటే బాగుండు. పార్లమెంట్ లో, అసెంబ్లీలో అరుస్తూ రాజ్యాంగాన్ని తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషువంటి భాషలలో వినిపించాలేమో. భగవద్గీత ప్రవచనం చేసేవారు, ఖురాన్ వీధి వీధిన చదివే వారి పక్కనే రాజ్యాంగం కూడా చదివేలా చట్టం తెస్తే బాగుంటుందేమో.
రాజ్యాంగంపై చర్చ గొప్ప విషయం
రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు? అందుకోసం చర్చించడం చాలా చాలా గొప్పవిషయం. ఒక బలమైన ప్రతిపక్షం ఉండడం వల్లనే ఈ చర్చ జరిగింది. దాని వల్ల ఏం జరిగింది అని నిట్టూర్పులు ఊర్చే వారు ఉంటారు. అంటే అంటారు. కాని కనీసం చర్చ జరుగుతున్నది. ఏదో వివాదం ఉందని తెలుస్తుంది. అదే ప్రజాస్వామ్యం లక్షణం. రాజ్యాంగం గురించి చర్చించేబదులు, అధికార పక్షం వారు నెహ్రూ, గాంధీ కుటుంబాలను రాజ్యాంగానికి తూట్లు చేసారనీ అంటే, సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే ఈ బీజేపీ రక్షిస్తుందా అని ప్రతిపక్ష నాయకులు అన్నారు.
అంటే అన్నారు. మన సగటుమనిషి చదువుతాడని, వింటాడని అనుకుందాం. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పటిష్టత, మహి ళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషి ని వివరించారు. ఆ పార్టీకి చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనం చేసారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ ను కళ్లెం వేస్తూ, అసమ్మతిని అణచి వేసేందుకు రాజ్యాంగ సవరణలు తెచ్చిందని ప్రధాని విమర్శించారు. ‘రాజ్యాంగం 25 ఏళ్లు పూర్తయినప్పుడు రాజ్యాంగం చిరిగిం ది. 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జ న్సీ) విధించారు. యావద్దేశాన్ని ఒక జైలు గా మార్చారు. రాజ్యాంగ హక్కులను ఊడలాక్కున్నారు. మీడియాను నోరెత్తనీయ లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం అణిచివేతకు గురైంది. కాంగ్రెస్ పార్టీపై పడిన ఈ మరక ఎప్పటి తొలగిపోదు’ అని ప్రధా ని పేర్కొన్నారు.
బీజేపీపై రాహుల్ దాడి
‘సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మీ రు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకుడిని అవహేళన చేసినట్టు అనిపించడం లేదా? మీ నాయకుడి మాటలను మీరు సపోర్ట్ చేస్తారా?’ అని బీజేపీ ఎంపీలను రాహుల్ ప్రశ్నించా రు. ‘మీరు (ప్రభుత్వం) అగ్నివీర్‌ను అమ లు చేసినప్పుడు యువకుల బొటనవేళ్లు కత్తిరించారు. 70 పేపర్ లీకేజీలు జరిగా యి. అదానీకి ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఇక్కడి చిన్న, మధ్య తరహా వ్యా పారుల బొటనవేళ్లను కోసేశారు.
దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రక్షణ పరిశ్రమను అదానీకి అప్పగించినప్పుడు దేశంలో నిజాయితీగా పనిచేసే వ్యాపారుల వేళ్లు కత్తిరించారు. ఇవాళ ఢిల్లీ వెలుపల రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రైతులపై లాఠీలు ఝళిపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముం టుంది?’ అని రాహుల్ ప్రశ్నించారు. హ థ్రాస్ అత్యాచార బాధితురాలి అంశాన్ని కూడా రాహుల్ ప్రస్తావిస్తూ, నేరానికి పాల్పడిన వారు వీధుల్లో తిరుగుతుంటే, బాధితురాలు మాత్రం ఇంట్లోంచి కదల్లేని పరిస్థితి ఉందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఒక మంత్రి నిర్ణయాన్ని రాసిన కాగితాన్ని చించిపారేశారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను రాజ్యాంగాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించానని పార్లమెంట్‌లో ప్రధానమంత్రి చెప్పారు. ఇంత గొప్ప ఐడియా ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. దేశం మొత్తం మీద ఇంకెక్కడ కూడా ఏనుగు మీద ఊరేగించలేదు. ఇంకా నయం. మన దేశానికి సారనాథ్ ప్రధాన ఆలయం, అశోక స్తం భం ఉంది.
(1905 మార్చి 15న సారనాథ్ లో తవ్వితే అనేకానేక పురాతన వస్తువులతో పాటుగా అశోక సింహం, రాజధాని అవశేషాలు కనిపించాయి) అక్కడినుంచే మన భారత సామ్రాజ్యం.. సారీ సార్వభౌ మ ప్రతీకలు ఈ నాలుగు సింహాలు మనం చూస్తున్నాం. ఏనుగు ఆంబారీపై రాజ్యాంగాన్ని ఊరేగించాల్సిందే. సారనాథ్ సరే కాని ఆ గుర్తుగా మిగిలిన రాజ్యాంగ సారాంశాన్ని అర్థం చేసుకుంటే బాగుండే ది. నిజమైన నాలుగు సింహాలు రోడ్డు మీదికి వస్తే ప్రమాదమే కదా.
75 ఏళ్ల తర్వాతనైనా ...
అవును 75 ఏళ్లయిపోయింది. 2024 పోతే మన దేశ రాజ్యాంగానికి 76 ఏళ్ల వృద్ధాప్యం వస్తుంది. కనీసం 75ఏళ్ల తరువాత మనం రాజ్యాంగం గురించి మాట్లా డుకుంటున్నాం. ఎంత ఆనందం? ఇటీవ ల ఎన్నికలు జరిగినట్టు రాజ్యాంగం గురిం చి ఓట్ల సభల్లో పెద్దవాళ్లంతా మాట్లాడుకున్నారు. చాలా సంతోషం. రాజ్యాంగాన్ని పటిష్టం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, యూపీఏ, అధికారం రుచిమరిగిన కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచివేస్తున్నారని విమర్శించారు. విషబీజాలు నాటుతున్నాయని బీజేపీ విమర్శించింది.
‘నేను ఉన్నావ్ అత్యాచార బాధితులు, సంభల్ ఘర్షణల బాధిత కుటుంబాలను కలిశాను.. బాధితులకు పోరాటం చేసే శక్తి ని రాజ్యాంగం కల్పించింది.. న్యాయం కోసం వారు పోరాటం సాగించే అవకాశం కల్పించింది.. రాజ్యాంగం ఓ రక్షణ కవచం. అయితే, రాజ్యాంగం కల్పించిన ఆర్థిక, సామాజిక రక్షణకు అధికార ఎన్డీయే తూట్లు పొడుస్తోంది.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా వచ్చుండకపోతే వాళ్లు రాజ్యాంగాన్నే మార్చేయడం ప్రారంభించేవారు.. గతం గురించి మాత్రమే ఎన్డీ యే మాట్లాడుతోంది.. వర్తమానం గురిం చి ఎందుకు మౌనంగా ఉంది.. పుస్తకాలు, ప్రసంగాల నుంచి నెహ్రూ పేరును చెరిపేయవచ్చు.. కానీ, స్వాతంత్య్ర పోరాటం, జా తి నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ తొలగించలేరు’ అని రాహుల్, ప్రియాంక గాంధీలు తెలిపారు.
బీజేపీ ఓ వాషింగ్ మెషిన్..
‘కుట్రలు, ప్రలోభాల ద్వారా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మోదీ సర్కారు కూల్చేస్తోం ది.. బీజేపీ ఓ వాషింగ్ మెషిన్.. ఒక్కసారి ఆ పార్టీలో చేరితే అందరూ పునీతులవుతారు.. వేరే పార్టీలో ఉంటే వారిపై అవినీతి ముద్ర వేస్తారు.. ప్రజల గొంతుకను నొక్కేయడానికి దర్యాప్తు సంస్థలను ప్రయోగి స్తోంది. ప్రొఫెసర్ల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రజల నోరు మూయించేం దుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.’ అని అన్నారు.
రాజ్యాంగా న్ని రక్షిస్తామని వాగ్దానాలు చేసే పెద్దలు హిందుత్వ సిద్ధ్దాం త కర్త సావర్కార్‌ను ప్రశంసిస్తున్నారు. రాజ్యాంగాన్ని నిశితంగా వ్యతిరేకించిన వారు సావర్కార్. అసలు మన రాజ్యాంగమే భారతీయమైం ది కాదనీ, ఇది విదేశీ ప్రముఖులనుంచి రూపొందిన రాజ్యాం గం అని తిడుతూ ఉన్నారు. వీళ్లు మన రాజ్యాంగాన్ని రక్షిస్తారా? ఏ విధంగా? అని ప్రశ్నించారు. ఒకరు ఎమర్జెన్సీ కథ చెబితే, కాంగ్రెస్ నేతలు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బొటనవేలు ను గురుదక్షిణ చేసిన కథ వివరించారు.
ఏది నిజమో ఏది కాదో ఇప్పుడు చెప్పలేం. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో కనపడుతూనే ఉంది. ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోతున్నా యో తెలుసు. అర్థరాత్రి ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూల్చి వేస్తూ ఉంటే మళ్లీ ఎన్నికలు రావా? అప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది.
రాజ్యాంగ సవరణ పేరుమీద, ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అనేది ఒకే పారీ,్ట ఒకే ప్రభుత్వం, ఒకే నియంత అనే గతి రాకూడదు. లేకపోతే రాజ్యాంగం 75 సంవత్స రాల నాటి రాజ్యాంగానికి టోకు టోకుగా ప్రభుత్వాలు పడిపోతూ ఉంటే, ఎన్నికల ద్వారా సక్రమంగా జరిగే ఎన్నికలను నిర్వహించకపోతే రాజ్యాంగానికి ప్రమాదం కాదా? జనం ఆలోచించాలి.
- మాడభూషి శ్రీధర్