calender_icon.png 20 October, 2024 | 6:23 PM

ఏ టైమ్‌కి తినాలంటే!

14-10-2024 12:00:00 AM

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే టైమ్‌కి తినాలి అంటుంటారు వైద్యులు. ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా ఆహారం తీసుకోవాలి. అందులో ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. చాలామంది ఉదయం తొమ్మిదిలోపు బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం రెండు గంటలలోపు భోజనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో కొందరు ఎనిమిది గంటలకు, మరికొందరు తొమ్మిది గంటలకు, ఇంకొందరు పది గంటలకు కూడా భోజనం చేస్తారు.

అయితే రాత్రి భోజనం విషయంలో వైద్యులు చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రాత్రి భోజనం ఏడు గంటలలోపు తింటే ఏం జరుగుతుందో వివరించారు. రాత్రి ఏడు గంటలలోపు భోజనం చేయ్యడం వల్ల ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం దొరుకుతుంది. ఈ సమయంలో తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

దీనివల్ల రాత్రి సమయంలో కడుపు ఉబ్బరం, కడుపు భారంగా అనిపించడం, అజీర్ణం వంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత భోజనం చేస్తే సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, కడుపు అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.