- దేశంలో మీడియా స్వేచ్ఛపై విదేశాల్లో రాహుల్ దుష్ర్పచారం
- డల్లాస్‌లో భారత సంతతి జర్నలిస్ట్‌పై ఆయన టీమ్ దాడి
- పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబ డీఎన్‌ఏలోనే ఉంది
- రాహుల్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీగడ్డపై భారతదేశ ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా, రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. సెప్టెంబర్ 7న అమెరికాలోని డల్లాస్‌లో కాంగ్రెస్ గూండాల ద్వారా జరిపిన దౌర్జన్యకాండ పై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడు తూ.. ‘రోహిత్‌శర్మ అనే ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను కవర్ చేసేందుకు డల్లాస్ వెళ్లారు.
ఈ సందర్భం లో కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల ఇన్‌చార్జి శామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేశారు. రాహుల్ విదేశీ పర్యటన, భారత సంతతి ప్రజల స్పందన తదితర అంశాల గురించి ప్రశ్నల తర్వాత.. అమెరికా చట్టసభ్యులతో చర్చల సందర్భంగా బంగ్లాదే శ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందు ల పైనా రాహుల్ స్పందిస్తారా’ అని అడిగినట్లు తెలిపారు. ఈ ప్రశ్నతో అక్కడున్న కాంగ్రెస్ నాయకుల కు కోపం వచ్చి శర్మను దూషిస్తూ, దౌర్జన్యానికి దిగి ఆయన ఫోన్ లాక్కొని ఇంటర్వ్యూ వీడియో ను డిలీట్ చేశారని, దాదాపు 30 నిమిషాలసేపు గదిలో నిర్బంధించారని తెలిపారు.
ఇది రాహుల్, ఆయన సన్నిహిత బృందం చేసిన పనేనన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హత్యాకాండ పై అడిగిన ప్రశ్నకు అక్కడి రాహుల్ అనుచరులు ప్రవర్తించిన తీరు హిందువులపై వారికున్న ద్వేష భావాన్ని మరోసారి బయటపెట్టిందన్నారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుం డా ఇలా వ్యక్తిగత దాడులకు దిగడం ప్రజాస్వా మ్య బద్ధమేనా అని ప్రశ్నించారు. దేశంలో పాత్రికేయులకు రక్షణ లేదని విదేశాల్లో దుష్ర్పచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. జర్నలిస్టు పట్ల తన సన్నిహితులు వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే నమ్మేదెవరు?
రాజ్యాంగ పుస్తకాన్ని ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరుగుతూ.. రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపై కపట ప్రేమను ప్రదర్శించే రాహుల్.. దేశ పరువు తీయాలనే ఏకైక లక్ష్యంతోనే విదేశీ పర్యటనలు చేయడం నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నాడు రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఎమర్జెన్సీ సమయంలో ఏకంగా పత్రికాస్వేచ్ఛను హరించారని. అనేక పత్రికలను నిషేధించి, ఎడిటర్లు, విలేకరులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించిన విషయాన్ని ప్రజలెవరూ మరిచిపోలేదన్నారు.
మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలో, ప్రత్యేకంగా నెహ్రూ కుటుంబంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు హిందువుల రక్షణ గురించి ఆలోచించదని.. ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, మారణకాండ గురించి ఏ కాంగ్రెస్ నాయకుడూ మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి...
బంగ్లాదేశ్ గడ్డపై హిందువులకు భద్రత కల్పించే విషయంలో బంగ్లా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడితో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగానూ మోదీ ప్రస్తావించారన్నారు. మెజార్టీ ప్రయోజనాల మనో భావాలు అర్థం చేసుకోలేనన్ని రోజులు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినా కాంగ్రెస్‌ను ఎవరూ విశ్వసించరని ఆయన అన్నారు.