అమృత్‌సర్, డిసెంబర్ 27: మన్మోహన్ సింగ్ మరణం పట్ల అమృత్‌సర్‌కు చెందిన రాజ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ కుటుంబం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలోని పేట వాల బజార్‌లో నివాసం ఉండేదని గుర్తు చేసుకున్నారు.
మన్మోహన్ ఇంటి పక్కనే తన ఇల్లు కూడా ఉండటంతో ప్రతి రోజూ ఆయన నడవడికను గమనించినట్టు వెల్లడించారు. మన్మోహన్ చాలా వినయంగా నడుచుకునే వారని చెప్పారు. అయితే తాను చిన్నగా ఉన్నప్పుడే మన్మోహన్ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసిందని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబం ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన గాహ్ గ్రామంలో నివాసం ఉండేదన్నారు.