calender_icon.png 22 January, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం చెప్తున్నది అబద్ధమని తేలింది

22-01-2025 02:49:21 AM

కృష్ణా జలాల నిష్పత్తిపై హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా కాంగ్రెస్ చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తేల్చే శారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34:-66 శాతం ఒకే ఏడాదికేనని, క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకా రం తెలంగాణకు 71 శాతం నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ ప్రభు త్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను కోరిందని స్పష్టం చేయడం విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించే సమాధానమని మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

వాటాలు తేలేవరకు 50:50 కేటాయించాలని 2015న తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు కృష్ణా బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగని సత్యాలన్నారు. ఏపీ పున్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 89 పెట్టి, ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసిందన్నారు. కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్నారు.