calender_icon.png 26 December, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకే ఏమి చేయనీ సీఎం ప్రజలకు ఏం చేస్తారు

06-12-2024 04:56:14 PM

అవసరమైతే అసెంబ్లీ ఎదుట అమరన నిరాహార దీక్ష చేస్తా 

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావలసిన వేతనాలు బెనిఫిట్స్ రావడం లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకే ఏమి చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమి చేస్తారని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు, రైతు పండుగ పేరుతో రైతులను యువ వికాసమంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతానని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు కలుపుకొని పాలతో అభిషేకం చేస్తామని అన్నారు.

రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎయిర్టెల్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడం లేదని రోడ్లపై వస్తున్నారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ఎదుట అమరన నిరాహార దీక్ష చేపడుతానని అన్నారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ కుమార్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, తేలు శ్రీనివాస్, రిటైర్డ్ ఉద్యోగులు సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.