calender_icon.png 4 March, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూంబ్స్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు?

04-03-2025 02:01:11 AM

రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆగా ఖాన్ ట్రస్ట్‌ను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి):‘ కుతుబ్ షాహీ టూంబ్స్ పరి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి ?’ అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్రప్రభుత్వంతోపాటు ఆగా ఖాన్ ట్రస్టును ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. అలాగే విచారణ వాయిదా వేసిం ది. రూ.100 కోట్ల నిధులతో కుతుబ్ షాహీ టూంబ్స్ పరిరక్షణ పనులు చేపడతామని ఆగా ఖాన్ ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నదని, కానీ.. పనులను సక్రమంగా చేపట్టడడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ హైకోర్టుకు లేఖ రాశారు.

లేఖను ఏసీజే సుమోటో పిల్‌గా విచారణకు అనుమతించారు. పిల్‌పై తాత్కాలిక ప్రధాన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాస నం స్పందిస్తూ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రాష్ట్ర పురావస్తు శాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యద ర్శులు, ఆగా ఖాన్ ట్రస్ట్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.