- సినీ ప్రముఖులు రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?
- ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘట నలో జరిగిన వాస్తవాలనే సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, అందులో వ్యక్తిత్వ హననం ఏమి ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. రేవతి సొంత సోదరి అయితే బాధ ఎలా ఉంటుందో ఆలోచించా లని, ఒక యాక్టర్‌గా అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన నిలదీ శారు. ఆదివారం గాంధీభవన్‌లో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్, పీసీసీ అధికార ప్రతి నిధి గౌరీ సతీష్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖులు, అల్లు అర్జున్‌ను పరామర్శిస్తు న్నారు కానీ.. రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఇలాం టి ఘటనలు మళ్లీ జరగవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. హీరో లను సమాజం, యువత రోల్ మోడల్‌గా తీసు కుంటారన్నారు. ఇండస్ట్రీని దెబ్బతీయా లనుకుంటే టికెట్‌ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందన్నారు.