calender_icon.png 24 October, 2024 | 5:53 AM

మీరేం చర్యలు తీసుకున్నారు?

24-10-2024 03:14:38 AM

బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్

సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: సోషల్ మీడియా వేదికగా విమానాలకు బూటకపు బాంబు బెదిరింపుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుండటంతో వాటి కట్టిడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పలు సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంకేత్ భోండ్వే భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎక్స్, మెటా సహా ఇతర సంస్థల ప్రతినిధులు హాజరవ్వగా.. బూటకపు సందేశాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ ఎస్. భోండ్వే ఆదేశించారు. అనంతరం ఆయా మాధ్యమాల పని తీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వ్యవహారశైలి నేరాలను ప్రోత్సహించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. గత వారం పదిరోజుల్లోనే సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా 170 విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలను పంపించారు. ఈ వరుస బెదిరింపుల పట్ల ప్రయాణికులతోపాటు విమానయాన సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.