04-03-2025 01:01:17 AM
రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ‘తెలంగాణలో కోతుల బెడద నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు’ అని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే గతంలో విచారణలో ఉన్న పిల్‌కు ఈ సుమోటో పిల్ జత చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.
రాష్ట్రంలో కోతుల బెడదపై తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ఎం.మల్లన్న ఇటీవల హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సోమవారం తాత్కాలిక ప్రధాన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం విచారణ చేపట్టింది.