- కాళేశ్వరం 9వ ప్యాకేజీపై నిర్లక్ష్యం
- ట్రయల్ రన్ పూర్తయి ఏడాది పూర్తి
- నేటికీ ప్రారంభానికి నోచుకోని రిజర్వాయర్
- ఒక్క టీఎంసీతోనే సరిపెట్టిన అధికారులు
- లక్ష ఎకరాలకు సాగు నీటి సమస్య తీరేనా?
సిరిసిల్ల, నవంబర్ 3 (విజయక్రాంతి): సహజ సిద్ధమైనా గుట్టల మధ్య నిర్మితమైనా మల్కపేట రిజర్వాయర్ దశబ్దాకాలమైనా ప్రారంభానికినోచుకోవడం లేదు. రిజర్వాయర్ పనులు పూర్తయినా అందు బాటు లోకి తీసుకురావడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఈ ప్రాజెక్ట్ అందుబాటు లోకి వస్తే జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరందుతుంది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి ఆదేశాల తో ఇటీవల మల్కపేటను సాగు నీటి ప్రాజెక్ట్‌ల ఈఎన్సీ అనిల్ సందర్శించారు. ప్రాజెక్ట్ లో పెండింగ్ పనులను పరిశీలించారు.
ఎత్తిపోతలో అధికారుల నిర్లక్ష్యం
కొదురుపాక మిడ్ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరువలో నీటి మట్టం ఉంది. కానీ, మల్కపేట రిజర్వాయర్‌కు మాత్రం నీటిని ఎత్తిపోయడంలో అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లోకి ఇక్కడి నుంచి నీటిని తర లించి, అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌లకు నీటిని తరలి స్తున్నారు. సమీపంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్‌కు మాత్రం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు మాత్రం రావడం లేదు.
మల్కపేట రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు ఉండగా, యేడాది నుంచి నీటిని నింప డం మానేశారు. ఈ ప్రాజెక్ట్‌ను నింపితే ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, గంభీరా వుపేట, సిరిసిల్ల మండలాల పరిధిలోని బీడు భూములకు సాగు నీరందించేందుకు వీలుటుంది.
ఎత్తిపోతల పథకం ద్వారా యేడాదికి 120 రోజుల పాటు 11.63 టీఎంసీల నీటిని మిడ్ మానేరు నుంచి మల్కపేట ప్రాజెక్ట్‌లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుం చి బ్యాక్ వాటర్‌ను కాలువ ద్వారా సింగసముద్రం చెరువుకు, ఆపై గంభీరావుపేట బట్టల చెరువులోకి మళ్లిస్తారు. అక్కడి నుంచి ఎగువమానేరులోకి 2 టీఎంసీల నీటిని తరలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఇంజినీరింగ్ అధికారులు శ్రద్ధ చూపట్లేదు.
ప్రభుత్వ విప్ ఆది చొరవ
మెట్ట ప్రాంత ప్రజలకు సాగు నీటి సమస్యను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పం తో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి మల్కపేట సమస్యను తీసుకెళ్లి పెండింగ్ పనుల కోసం అదనంగా నిధులు మంజూరు చేయాలని కోరారు.
ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే, నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్‌కు ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు తరలిస్తే, వేములవాడ మూలవాగు నిత్యం జలధారగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పనులు నత్తనడకన సాగాయని ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల కంటే అలస్యంగా ప్రారంభించిన ప్యాకేజీ 10, 11, 12 పనులు పూర్తి చేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేటలో 2013లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా పేరు మార్చారు. రూ.1,464.42 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పొడవు 32 కిలోమీటర్లు ఉండగా, సిరిసిల్ల నుంచి మల్కపేట 12.03 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఉంది.
దాదాపు పనులన్నీ పూర్తి చేసుకోని గత ప్రభుత్వం రిజర్వాయర్‌ను ప్రారంభించేందుకు 2023 జూన్‌లో ట్రయల్ రన్ సైతం నిర్వహించింది. పంపుల ద్వారా మల్కపేటలోకి ఒక టీఎంసీని నింపింది. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పట్టికీ ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారు.
మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
మల్కపేట రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను తీర్చే విధంగా పనులు చేస్తున్నాం. మల్కపేట రిజర్వాయర్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. త్వరలోనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించుకోని ఈ ప్రాంతంలోని లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం. బాయిసాయిపేట పరిధిలో ఉన్న లచ్చపేట చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని అధికారులకు సూచించాం.
ఆది శ్రీనివాస్,
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్