బాడీ లోషన్లు వాడటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అయితే వాటిని వాతావరణాన్ని బట్టి మారుస్తూ ఉండాలి. ప్రతిసారి ఒకే రకమైన లోషన్లను వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు లోషన్లు ఉపయోగించాలి.
* కాలానుగుణంగా ఉన్న క్రీమ్ లేదా లోషన్స్ వాడితేనే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నా రు నిపుణులు. లేకపోతే చర్మం తన గుణాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా వాడితే అనేక రకాలైన చర్మవ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
* వాతావరణంతోనే కాకుండా కొన్ని ఇండ్లల్లో, స్విమ్మింగ్ ఫూల్స్, వ్యాయామం చేసుకునే క్రమంలో కూడా వివిధ రకాలా బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు. స్విమ్మింగ్ తర్వాత అందులోని క్లోరిన్ చర్మంపై పడి పొడిగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు.
* చర్మం రఫ్‌గా పొడిబారిపోయినట్లయితే వాటికి అనుగుణంగా సరైన లోషన్స్ వాడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజులకు చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. వీటిని వైద్యుల సలహా, సూచనలతో మాత్రమే ఉపయోగించాలి.