‘వంటిట్లోకి పోగూడదు.. వండమన్నదే వండాలి. తినమన్న తర్వాతే తినాలి. వాసన నూనె రాసుకోగూడదు. వాలు జడ వేసుకోకూడదు. పూలు పెట్టుకోగూడదు. పడక గదిలోకి తొంగి చూడకూ డదు” అనే అత్తల ఆంక్షల నడుమ కోడ ళ్లు ఎలాంటి పాట్లు పడ్డారనే కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రం ‘వరకట్నం’. ఈ చిత్రం 1969 జన వరి 10న విడుదలైంది. నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా..
నాగభూషణం, రాజనాల వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించగా.. ఎన్ త్రివిక్ర మరావు నిర్మించారు. ఎన్టీఆర్ సొం త బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. దురాచారమైన వరకట్నం ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందింది. పల్లెటూరిలో మనషుల మధ్య ఉండే మొండి పట్టుదల, వారి మధ్య ఉండే అనుబంధాలు, పట్టింపులు అన్నింటినీ ఈ చిత్రంలో చక్కగా చూపించారు.
ఎన్టీఆర్ ఆహార్యం ఈ చిత్రానికి బాగా కలి సొచ్చింది. రెండు గ్రామాలకు చెందిన కథ ఆధారంగా చిత్రం రూపొందింది. మీసాల సుబ్బయ్య(నాగభూషణం) అనే మోతుబరి రైతు తన కొడుకు దేవసింహ(ఎన్టీఆర్)కు పక్క గ్రామానికి చెందిన మోతుబరి భద్రయ్య(మిక్కిలినేని) కుమా ర్తె సుజాత(కృష్ణ కుమారి)తో పెళ్లి నిశ్చయం చేస్తాడు.
పెళ్లిలో ఓ పేచీకోరు అచ్చయ్య(అల్లు రామలింగయ్య) కారణంగా మాట పట్టింపుతో దేవ సింహ.. సుజాత మెడలో తాళి కట్టకుండా వెళ్లిపోతాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? ఆ తరువాత దేవసింహ ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆ పెళ్లిలో వరకట్నం ఎలాంటి చిచ్చు పెట్టింది? వంటి అంశాలను చక్కగా ఈ చిత్రంలో చూపించారు.