calender_icon.png 13 January, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదిరేటి డ్రెస్సు మేమేస్తే!

27-08-2024 12:00:00 AM

ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడం ఇండియన్ డిజైనర్లు ఎప్పుడూ ముందే ఉంటారు. మారుతున్న లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా కొత్త కొత్త డిజైనింగ్స్‌ను  పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యుల అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులు చేస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల మనదేశంలో జరిగిన ‘ఇండియా కోచర్ వీక్ 2024’ ఫ్యాషన్ ప్రదర్శన ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. అప్పటి నవాబుల కాలం నుంచి నేటి ప్రధానమంత్రుల వరకు ధరించే దుస్తులు, భారతీయ సంప్రదాయానికి అద్దంపట్టే వధువరూల క్యాస్టూమ్స్, అదిరిపోయే షేర్వానీ, లెహంగాతో జిగేల్ మనిపించారు. హీరోయిన్స్ రష్మిక మందన్నా, సోనాక్షిసిన్హా, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఆ సరికొత్త డిజైన్లను ప్రదర్శించి మంత్రముగ్ధులను చేశారు. ఈ డిజైన్లు అందంతోపాటు భారతీయ దర్పాన్ని చూపాయి.