calender_icon.png 26 February, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై కేసుల్లో మీ వైఖరేంటి ?

26-02-2025 01:34:34 AM

  1. వెంటనే కౌంటర్ దాఖలు చేయండి
  2. సైఫాబాద్, ఉట్నూరు పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైఫాబాద్, ఉట్నూర్‌లో నమోదైన కేసుల్లో వెంటనే పోలీసుల వైఖరేంటో వెల్లడించాలని, ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ గతేడాది ఆగస్టులో సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే మూసీ ప్రాజెక్ట్ పేరిట రూ.25 వేల కోట్ల నిధులను సీఎం ఢిల్లీకి తరలించారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ నాయకురాలు గతేడాది సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీసులను ఆశ్రయించారు.

రెండు కేసుల్లోనూ నమోదైన ఎఫ్‌ఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణారావు తన వాదనలు వినిపిస్తూ.. రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగానే ప్రతివాదులు కేటీఆర్‌పై కేసులు బనాయిం చారన్నారు. రెండు కేసుల్లోనూ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని, అరెస్టు సహా తదుపరి విచారణ నిలిపివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేశారు.