calender_icon.png 30 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ గదిలో ఏం ఉంది..?

18-07-2024 12:05:00 AM

ఒడిశా జూలై ౧౭: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర భాండాగారం రహస్య గది తలుపులను గురువారం అధికారులు తెరవనున్నారు. దీనికి సంబం ధించి ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభమూహూర్తంగా నిర్ణయించారు. ఆ గదిలో ఏం ఉం టుందా అని ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో  నిర్వహించిన సమావేశంలో ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా జస్టిస్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించాం. ఇప్పడు గురువారం రహస్య గదిని తెరిచి అందులో ఉన్న సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్ర పరుస్తాం. అనంతరం భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మ తుల నిమిత్తం అపగిస్తామని వెల్లడించారు. పనులు పూర్తయ్యాక సంప దనంతా మళ్తీ రహస్య గదికి తెచ్చి లెక్కింపు చేపడతామని తెలిపారు.