calender_icon.png 26 October, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

త్రివిక్రమ్ కథేమిటో!

16-07-2024 12:10:00 AM

‘గుంటూరు కారం’ సినిమాని ఈ ఏడాది సంక్రాంతికి తెరమీదికి తీసుకొచ్చిన త్రివిక్రమ్, తర్వాతి సినిమాని అల్లు అర్జున్‌తో చేయనున్నట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో ‘జులాయి’, ‘అల వైకుంఠపురం’ చిత్రాలు రాగా ఇప్పుడు చేయనున్నది మూడవది. ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’ చిత్రీకరణలో ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా సెట్స్ నుంచి కొద్ది రోజులలో బయటపడినా.. డబ్బింగ్, ప్రచారం వంటి వాటితో ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. ఆ లెక్కన త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేది 2025లోనే అంటున్నాయి సినీ వర్గాలు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి త్రివిక్రమ్ ఎలాంటి కథ సిద్ధం చేశారన్న కోణం తాజాగా ఓ విషయం తెలియవచ్చింది.

తన గత చిత్రాల మాదిరి కుటుంబ అంశాలు, కామెడీ కాకుండా బన్నీ కోసం ఓ విభిన్నమైన కథని సిద్ధం చేశారట దర్శకుడు. ‘కల్కి’ కోవలో పురాణ ప్రస్తావన సైతం ఉండనుందని సమాచారం. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌తో చేయనున్న దర్శకులలో పలువురు పేర్లు వినిపించినప్పటికీ తొలిస్థానం త్రివిక్రమ్‌దే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం నాడు హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని త్రివిక్రమ్ కలిశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సినిమా చర్చలు ఏమైనా సాగాయా.. ఆ కథేమిటా అన్న విషయంపై సినీ అభిమానులు ఆరా తీస్తున్నారు.