calender_icon.png 6 January, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ వంతెనల కథేంటి?

12-07-2024 02:19:16 AM

  1. నెల రోజుల్లో 12 బ్రిడ్జిలు నేలకొరిగాయి
  2. నదీ ప్రవాహాలను మార్పే కారణమని నివేదికలు
  3. చిన్న వంతెనలపైనా అదే తరహా కథనాలు

పాట్నా, జూలై 11: గత మూడు వారాలుగా బీహార్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలుతుండటమే. మూడు వారాల్లో చిన్న, పెద్దవి కలిపి 12 వంతెనలు కుప్పకూలాయి. అయితే, బ్రిడ్జిలు కుప్పకూలడంలో అవినీతి, అక్రమాలు విషయం కాకుండా నిర్మాణ లోపాలను మాత్రమే ఎత్తిచూపుతూ ప్రభు త్వం తప్పించుకుంటోంది. కేవలం నదీ ప్రవాహాన్ని మార్చడం వల్లనే వంతెనలు నిలబ డలేకపోతున్నట్లు వెల్లడిస్తున్నాయి. కానీ, తక్కువ కాలంలో ఇన్ని వంతెనలు కూలడం ఏ రాష్ట్రంలో జరిగుండదు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార ఎన్డీయే ప్రభుత్వంపై విమ ర్శలు వెల్లువెత్తుతున్న విపక్షాలు సైతం పెద్ద గా ప్రతిఘటన చేయట్లేదు. ఇందులో రాజకీ య కోణాలు ఉన్నట్లు తెలుస్తున్నా నిపుణుల కమిటీలు చెప్పిందే వినాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నదీ ప్రవాహం మార్పే కారణమా?

2020 నుంచి బీహార్‌లో రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. ఎన్డీయేను వీడిన నితీశ్ మహాఘట్బంధన్‌లో చేరారు. ఆ తర్వాత మళ్లీ ఎన్డీయే వైపే మొగ్గు చూపారు. తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు రాష్ట్రంలో అవినీతికి ఊతమిచ్చాయనే ఆరోపణలు వినిపించాయి. ఈ పరిణామాల మధ్య సరైన ప్రణాళికలు లేకపోవడం, నాసిరకం పనులు, నిర్వహణ లోపం వంటి కారణాలతో రాష్ట్రంలో వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. గత మూడు వారాల్లో 12 వంతెనలు కూలిపోయాయి.