19-04-2025 12:42:47 AM
గజ్వేల్, ఏప్రిల్ 18: రోడ్డుపైకి వచ్చి మరి మురుగునీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆఫీసర్స్ కాలనీ ప్రాంత కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడి టోరియం వెనక వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది. గత ఏడాదిగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో పరిస్థితి అలాగే కొనసాగుతుంది.
మురుగునీరు వీ ధుల్లోనే ప్రవహిస్తుండడంతో ప్రాంతమంతా దుర్గంధం బెదజల్లుతూ దోమలకు ఆలవాలంగా మారింది. ప్రజలు ఏడాదిగా ఇబ్బం దులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తు న్నారు. వెంటనే తమ ప్రాంత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.