ఎన్గిడి, నోకియా రీఎంట్రీ
జోహన్నెస్‌బర్గ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సౌతాఫ్రికా 15 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరమైన లుంగి ఎన్గిడి, నోకియా నోర్టే రీఎంట్రీ ఇచ్చారు. బవుమా సారధ్యంలోని సౌతాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఫిబ్రవరి 21న, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 25న, ఇంగ్లండ్‌తో మార్చి 1న ఆడనుంది.
గజ్జల్లో గాయం కారణంగా పేసర్ కొయెట్జీని ఎంపిక చేయలేదు. కేశవ్ మహరాజ్, షంసీ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. వెస్టిండీస్, శ్రీలంకపై టెస్టు సిరీస్ విజయాలతో సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది.