calender_icon.png 5 February, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల త్యాగాలకు ఏది గుర్తింపు?

21-01-2025 12:00:00 AM

నీళ్లు, నియామకాలు, నిధుల కో సం జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది. వి.ప్రకాష్ రాసిన ‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం’లోనూ,  తెలంగాణ చరిత్రకు సంబంధించి న మిగతా పుస్తకాలలో ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలలో ఉపాధ్యాయుల చరిత్ర లిఖించబడకపోవడం బాధాకరం.

ప్రత్యేక తెలంగాణ ఉద్య మంలో విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మేధావులు,పౌర సంఘాల బృందాలు, సంఘటిత, -అసంఘటిత రంగాలు, కులాలు, సామాజిక వర్గాలు, ఇతర సాంఘిక బృందాల పాత్ర గురించి మనకు అందుబాటులో ఉంది కానీ ఉపాధ్యాయుల పాత్ర గురించి లేకపోవడం శోచనీయం.

ప్రతి ఆందోళనలో కీలక పాత్ర

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి, పోరాట ఆవశ్యకత గురించి ఉపాధ్యాయు లు పాఠశాలలలో బోధించడం, పాఠశాల సమయం తర్వాత సెలవు దినాల్లో విద్యార్థుల ఇండ్లకు పోయి అవగాహన కల్పించా రు. ఎంతోమంది విద్యార్థులు ప్రత్యేక తె లంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఉపాధ్యాయుల ప్రొత్సాహం ఎంతో ఉంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి జరిగిన ఉద్యమాలలో ముఖ్యంగా సక ల జనుల సమ్మె, రైలు రోకో, ఊరూరా రో డ్లపై వంటావార్పులు, మానవహారాలు, సహాయ నిరాకరణ,పెన్‌డౌన్ సమ్మెలు, బతుకమ్మ ఆటలు, బోనాల ఊరేగింపులు, సాగరహారం, మిలియన్ మార్చ్, కోటి సం తకాల సేకరణ,ఉద్యమ గీతాల రచనలు, విద్యార్థుల చేత ర్యాలీలు, తెలంగాణ సాహి త్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలంగాణ వంటల గురించి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సంపూర్ణ సహకారం అందించా రు.

తెలంగాణ కవులు, భాష,యాస, చరి త్ర, సాహిత్య, సాంస్కృతిక నేపథ్యం గు రించి వివరించడంలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నప్పుడు సమైక్యాంధ్ర కోరుకునే ఉపాధ్యా యులు దాడులు, దౌర్జన్యాలు చేయడం, ఉద్యోగం పోతుందని భయపెట్టిన సంఘటనలు కోకొల్లలు.

ప్రత్యేక రాష్ట్రంలో గుర్తింపు కరవు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త ర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని అనుకున్నా రు. సకలజనుల సమ్మెలోనూ, మిగతా ప్ర త్యేక తెలంగాణ  ఉద్యమాలలో, పోరాటాలలో ముందుండి నడిపిన ఉపాధ్యాయు లకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేళ్లపై లెక్కించదగిన వారికి రాజకీయ అవకాశాలు, నామినేటెడ్ పదవులు దక్కాయి కా నీ అనేక మందికి కనీసం గుర్తింపు కూడా దక్కలేదు.

విద్యార్థి, ఉద్యోగ సంఘాల నా యకులు అనేక మందికి రాజకీయ, నామినేటెడ్ పదవులు దక్కాయి. శాసనమండలి ఛైర్మన్, బేవరేజెస్ ఛైర్మన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులుగా, శా సన సభ, శాసన మండలి సభ్యులుగా, ఇం కా అనేక నామినేటెడ్ పదవుల్లో ఉ ద్యోగ సంఘాల నాయకులకు అవకాశం వచ్చిం ది. కాని ఉపాధ్యాయులు ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందుకోలేక పోయారు.

సంఘాలకు అతీతంగా టీటీఎఫ్ 

సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యా య సంఘాల నుంచి అనేకమంది ఉపాధ్యాయులు సంఘంగా కాకుండా తెలం గాణ టీచర్స్ ఫోరం (టీటీఎఫ్ ) ఏర్పాటు చేసుకొని విద్యార్థుల చేత ర్యాలీలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నిర్వ హించిన అన్ని నిరసన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రిలో ప్రభు త్వ సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఉపా ధ్యాయ సంఘాలకతీతంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ముత్యాల రవీందర్, గాజుల శ్రీధర్, మల్లికార్జున రెడ్డి, ఎల్లయ్య,డి.గిరివర్ధన్,శ్రీవాటి శ్రీనాథ్,రవీందర్ రెడ్డి, డాక్టర్ బాలరాజు, నర్సింగ్ రావు, సంజీవ్ తదితరులు కలిసి గాజుల శ్రీధర్ ను కన్వీనర్ గా, మిగతా వారిని సభ్యులు గా ఎన్నుకున్నారు.

రెండవ సమావేశం సుల్తాన్ బజార్ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగింది. ఈ సమావేశంలో మల్లయ్య, అంజయ్య, రామకృష్ణ తదితరులు అదనంగా హాజరై ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్‌లో సమావేశం ని ర్వహించి టీటీఎఫ్‌ను వివిధ జిల్లాలకు వ్యా పింపజేయాలని తీర్మానం చేశారు. తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్‌గా ఉన్న శ్రీధ ర్  అమెరికాకు వెళ్ళడంతో మల్లికార్జున రెడ్డి, ఎల్లయ్య కన్వీనర్‌లుగా వ్యవహరించారు.

హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్‌లో గల అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ టీచర్స్ ఫోరం రాష్ట్ర సదస్సును నిర్వహించారు. తెలంగాణలోని పూర్వ పది జి ల్లాల నుండి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్య లో జయప్రదం చేసారు.  తెలంగాణ టీచ ర్స్ ఫోరం ఉపాధ్యాయుల సమావేశంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్, పాశం యాదగిరి, శ్రీధర్ దేశపాండే, అల్లం నారాయణ, విఠల్, విమలక్క, ప్రొఫెసర్ కోదండరాం, పద్మక్క తదితరులు అనే క మంది పాల్గొన్నారు.

తెలంగాణ జేఏసీకి ప్రొఫెసర్ కోదండరాంను కన్వీనర్ గా నియమించారు.  జెఏసీలో తెలంగాణ టీచ ర్స్ ఫోరం భాగస్వామ్యం అయ్యింది. తెలంగాణ జెఏసీ ఆధ్వర్యంలో ఏ నిరసన కార్య క్రమం చేసినా తెలంగాణ టీచర్స్ ఫోరం చురుకుగా పాల్గొంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలలో చీలికలు  ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకునే వారు ఒక పక్క, సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుకునే వారు మరో పక్క రెండుగా చీలిపోయారు. దీం తో తెలంగాణ రాష్ట్రంలోని పూర్వ పది జి ల్లాల ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా తెలంగాణ టీచర్స్ ఫోరంలో భాగ స్వాములు కావడం అనివార్యమైంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలలో చీలికలు ఏర్పడి సమస్యల పరిష్కారంలో గానీ రాజకీయ పదవులు , నామినేటెడ్ ప దవులు దక్కించుకోవడంలో వెనుకబడి పోయారు. గతంలో ఏపీటీఎఫ్ నాయకులుగా ఉన్న బసవ పున్నయ్య, మార్పు బాలకృష్ణమ్మ, ఇతర ఉపాధ్యాయ సంఘా ల నాయకులు ఏదైనా పోరాటానికి పిలు పు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు గడగడ వణికేవి. సమస్యలు వెంటనే పరిష్కరించేవారు. ఇప్పుడుఆ పరిస్థితి లేదు.

రేవంత్ సర్కార్‌పై ఆశలు

గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం ఉపాధ్యాయులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేయలేదు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ, పంచా యతీ రాజ్, ప్రయివేటు  పాఠశాలల్లో, వి ద్యాసంస్థలలో  ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం పాడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర గీతం గా ప్రకటిం చ లేదు.

2023లో జరిగిన శాసనసభ ఎ న్నికలలో అధికారం దక్కించుకున్న కాంగ్రె స్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ ఈ గీతా న్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి గా తెలంగాణా కోసం అనేక పాటలు రాసి ఆ డిపాడి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం గద్దరన్న కూతురుకు ఇవ్వడం జరిగింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినఆరుగురి కి కోటి రూపాయలు, 300 గజాల స్థలం చొప్పున కేటాయించడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా లేని ఉపాధ్యాయుల ప దోన్నతులు, ఆరు సంవత్సరాలుగా లేని బ దిలీలు చేయడం జరిగింది. రేవంత్ సర్కా ర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకులకు తగిన అవకాశాలు కల్పించాలని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు కోరుతున్నారు. స్థానికులను స్థానికేతరులు గా మార్చిన జీవో సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కారం చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

వ్యాసకర్త సెల్:  9290826988