calender_icon.png 24 December, 2024 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ అధికారులకు రక్షణ ఏది?

24-12-2024 12:17:18 AM

  1. ప్రాణాలను పణంగా పెట్టి విధులు
  2. క్రూర మృగాలు, స్మగ్లర్లతో సావాసం
  3. భయాందోళనలో కుటుంబాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 2౩ (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీప్రాంతాన్ని రక్షిస్తారు. విధి నిర్వహణలో అనేక దాడులను ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్నిసార్లు సంఘ వ్యతిరేక శక్తులు, స్మగ్లర్ల చేతిలో కొంత మంది చనిపోతున్నారు.

కొంత మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగినప్పటికీ తీవ్రంగా గాయపడి విధులకు శాశ్వతంగా దూరమైన పరిస్థితులున్నాయి. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు లేకపోయినా రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 20కిపైగా పులులు ఉన్నాయి.

అధికారికంగా మాత్రం 10 పులులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అడవిలో క్రూర మృగాల నుంచే కాకుండా పాములు, చీడ పురుగులు, ఇతర జంతువుల నుంచి తమను తాము రిక్షించుకుంటూ అటవీప్రాంతాన్ని, వన్యప్రాణులను, అటవీ సంపదను కాపాడుతారు. అటవీశాఖలో కింద స్థాయి ఉద్యోగులు యూనిఫాం సర్వీసులు.

వారు అడవికి కాపలా ఉండాలి. చెట్లను నరకకుండా, వేటగాళ్ల నుంచి జంతువులను, ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలి. విధి నిర్వహణలో వారికి ఎలాంటి వాహనం, ఆయుధం ఉండదు. బీట్ పరిధిలో సదరు అధికారి ఐదు వేల ఎకరాలను రక్షించాల్సి ఉంటుంది.

ఆయుధాల కోసం ఎదురుచూపు

అటవీశాఖ అధికారులు ఆయుధాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా రు. ప్రభుత్వాల వద్ద ప్రతిపాదనలు పెట్టినపట్టికీ ఆయుధాలు అందించలేదు. ఏదైనా దాడి జరిగితే తప్పించుకునేందుకు కనీసం వాహనం కూడా ఉండదు. 1982 వరకు ఉమ్మడి ఏపీలో అటవీశాఖ అధికారులకు ఆయుధాలుండేవి. మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకుపోతున్నారని వాటిని అప్ప గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది.

ఎర్ర చందనం అక్రమ రవాణ జరిగే ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల అనుమతించారు. 1994 సంవత్సరంలో వాటిని కూడా వెనక్కి తీసుకున్నారు. 2013లో ఆయుధాల కోసం అటవీశాఖ ఉన్నతాధికారులు ఉమ్మ డి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆయుధాలు ఇవ్వాలన్న డిమాండ్ ఉత్పన్నం అయినప్పటికీ ఆయుధాలు ఇవ్వలేదు.

అయుధాల కోసం ప్రతిపాదనలున్నాయి

అటవీశాఖ సిబ్బందికి ఆయుధా లు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతి పాదనలు పంపిం చాం. ఆ యుధాలు ఇస్తే వాటి రక్షణ ఎలా చేయలన్నది ప్రశ్నగా మారింది. పోలీస్‌శాఖలో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉంటాయి. గతంలో ఆయుధాలున్నప్పుడు మావోయిస్టులు వా టిని ఎత్తుకుపోయిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. 

  డోబ్రియల్, పీసీసీఎఫ్