28-08-2024 03:11:35 AM
పెద్దపల్లి/ రామగుండం, ఆగస్టు 27 (విజయక్రాంతి): సింగరేణి యాజామాన్యం 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాలను ఇప్పటికీ ప్రకటించలేదు. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే యాజమాన్యం గతేడాది సాధించిన లాభాలతో పాటు దానిలో కార్మికుల వాటాను ప్రకటించడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఆర్థిక సంవత్సరంలో సంస ్థ రూ.2,222 కోట్ల లాభాలు ఆర్జించిం ది. 2023 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. దీంతో సంస్థ రూ.30 వేల కోట్ల పై చిలుకు లాభాలు గడించినట్లు తెలుస్తోంది.
గతేడాది వాటా ఇలా..
గత ఏడాది కార్మికులకు 32 శాతం లాభా ల వాటాను చెల్లించిన యాజమాన్యం ఈ ఏ డాది 35 శాతం వాటాను చెల్లిస్తుందని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2021 2 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వాటాను కార్మికులు చెల్లించగా 2022 ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వాటా చెల్లించింది. ఈసారి వార్షిక లక్ష్యాన్న అధిగమిం చడంతో 35 శాతం వాటా వస్తుందని కార్మికులు ఆశిస్తున్నారు. వాటా తేల్చాలని గుర్తి ంపు సంఘం కూడా యాజమాన్యంపై ఒతిడి తేవకపోవడంతో కార్మికులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గుర్తింపు సం ఘం ఎన్నికల అనంతరం గెలిచిన సంఘాని కి ఇప్పటివరకు గుర్తింపు పత్రం కూడా అందలేదు.
దీంతో స్ట్రక్చర్ సమావేశాలకూ తావు లేకు ండా పోయింది. లాభాలను ప్రకటించడం లో యాజమాన్యం జాప్యం చేయడం పట్ల కార్మిక వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కార్మిక సంఘాలు జోక్యం చేసుకొని యాజమాన్యం మీద ఒత్తిడి తీ సుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కార్మికులకు లాభాల వాటాను దస రా పండుగకు ముందే చెల్లి ంచేందుకు యా జమాన్యం కసరత్తు చేస్తున్న ట్లు తెలిసింది.
ఈ విషయమై ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబును క లిసి చర్చించగా దసరా పండుగకు ముందు ప ండుగ అడ్వాన్స్‌తోపాటు లాభాల వాటా ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఐతే వాస్త వ లాభాల నుంచి ఎంత శాతం వాటా చెల్లిస్తారనేది స్పష్టత రావడం లేదు. దీంతో కార్మికులు అందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది.