14-04-2025 12:58:39 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత గంజా యి అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు. పక్కా సమాచారంతో తరచూ పోలీస్, ఎక్సై జ్ అధికారులు గంజాయి అక్రమ రవాణా ను అరికట్టి, కేసులు నమోదు చేస్తున్న గంజాయి రవాణా తగ్గుముఖం పట్టడం లేదనేది స్పష్టం అవుతుంది.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లె మండలం, పాల్వంచ పట్టణములో రెండు వేరువేరు సంఘటనల్లో సుమారు రూ.4 కోట్ల విలువగల,778.360 కిలోల గంజాయిని పోలీస్ లు పట్టుకొని కేసులు నమోదు చేశారంటే, గంజాయి అక్రమ రవాణా ఏ రీతిలో సాగుతుందో ఇట్టే చెప్పవచ్చు. ఆంధ్ర ,చతిస్గడ్ రా ష్ట్రాల నుంచి ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు నిత్యం ఏదో ఒక రూపంలో గం జాయి రవాణా సాగుతోంది.
జిల్లా పోలీసులకు అందిన పక్క సమాచారంతో ఆదివా రం కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషగిరి నగర్ వద్ద అక్రమంగా రవాణా అవుతున్న రూ 3.36,68,000 వి లువగల 727.360 గంజాయిని, పాల్వంచ పట్టణ పరిధిలో రూ28 లక్షల విలువ గల 51 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు సంఘటనలతో అనుని త్యం గంజాయి రవాణా సాగుతుందని తేట తెల్లమవుతుంది.
వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం ఆగ్రా జిల్లాకు చెంది న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివం గుప్త, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసి పాక గ్రామం అటవీ ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తుల ద్వారా యూపీ82 ఏటి 9894 నెంబర్ గల లారీ ద్వారా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వల పన్ని పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుంచి మహారాష్ట్ర పూణేకు అక్రమంగా తరలిస్తున్న 51 కిలోల గంజాయిని పాల్వంచ పోలీసులు పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ రెండు సంఘటనలు బట్టి పరిశీలిస్తే అక్రమ గంజాయి రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అనటానికి నిదర్శనమని చెప్పవచ్చు.
గంజాయి రవాణా చతిస్గడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం నుంచే రవాణా జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ నిఘా పటిష్టం చేస్తే తప్ప గంజాయి అక్రమ రవాణా నివారణ అసా ధ్యం అని తేటతెల్లమవుతుంది. కేంద్ర ప్రభుత్వమే గంజాయి పై ఒక పాదం మోపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.