అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ అనిల్ కపూర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నటించారు.
1965లో జరిగిన ఇండియా వార్ నేపథ్యంలో భారతదేశ తొలి వైమానిక దాడి ఘటనల్లో సైనికుల మరణానికి ప్రతీకార డ్రామాగా ఈ చిత్రం రూపొందు తోంది. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క అప్‌డేట్‌ను వదులుతూ చిత్రంపై అంచనాలను పెంచేందుకు చిత్ర బృందం యత్నిస్తోంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘క్యా మేరీ యాద్ ఆతీ హై’ సాంగ్‌ను విడుదల చేశారు.