ట్రంప్ విజయంతో లాభమా? నష్టమా?
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఉత్కంఠకు తెర దించుతూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ మొదటిసారిగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని భారత్‌కు లాభం చేకూర్చితే, మరికొన్ని ఆందోళన కలి గించాయి.
ఈ క్రమంలో ట్రంప్ 2.0 ప్రభుత్వ నిర్ణయాలు ఇండియాను ఏ విధం గా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తిగా మారి ంది. ఇమ్మిగ్రేషన్, వాణిజ్యం, మిలటరీ అంశాల్లో ట్రంప్ నిర్ణయాలపై ఇరుదేశాల సంబంధాలు ఆధారపడనున్నాయి.
ఆ రంగాలపై ప్రభావం
ట్రంప్ లక్ష్యం అమెరికాను అసాధారణ రీతిలో సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడం. ఆయన ఎన్నికల నినాదం కూడా అదే. ఇందుకోసం ఆయన ఏం నిర్ణయం తీసుకోడానికి అయిన సిద్ధంగా ఉంటారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీని మంచి మిత్రుడిగా, భారత్‌తో బలమైన సంబంధాలు నెలకొల్పానంటూనే విమర్శలు గుప్పి ంచారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలను వసూలు చేస్తోందంటూ ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్నులు పెంచుతానని పేర్కొన్నారు. ట్రంప్ ఒక వేళ విదేశీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచితే ప్రధానంగా అమెరికా మార్కెట్లపై ఆధారపడిన భారత ఐటీ, ఫార్మా, టైక్స్‌టైల్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇదే సమయంలో భారత్‌కు సువర్ణావకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. ఈ నేపథ్యంలో చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించి, మానుఫ్యాక్చర్ హబ్‌గా మారేందుకు మార్గం సుగమం అవుతుంది.
భారతీయుల ఉద్యోగాలకు ఎసరు
అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు దోచుకుంటున్నారంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఈ మాటలు అక్కడి యువతను బాగా అకర్షించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఫారెన్ వర్కర్ల వేతన అవసరాలను పెంచి, ఇతర నిబంధనలను విధించడానికి ప్రయత్నించారు.
కంపెనీలు స్థానిక యువత వైపు మొగ్గు చూపే విధంగా ఒత్తిడి చేశారు. ఇప్పు డు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వలస విధానంపై నిబంధనలు కఠినతరం చేస్తే H------ వీసా ప్రోగ్రామ్‌పై తీవ్ర ప్రభావం పడి భారత ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు.
డిఫెన్స్ రంగాల్లో సంబంధం
అమెరికా మధ్య మిలటరీ, డిఫెన్స్ రంగాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఇరు దేశాల మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసీఈటీ), జెట్ ఇంజన్ల తయారీకి సంబంధించిన అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. ట్రంప్ 2.0లో మిలటరీ, డిఫెన్స్‌లో సహకారలకు సంబంధించిన ఒప్పందాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న అమెరికా ఇందుకోసం భారత్‌తో బలమైన సంబధాలు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయుధ విక్రయాలు, అత్యాధునిక సాంకేతికత బదిలీ అంశాల్లో భారత్‌కు అమెరికా తన సహకారాన్ని అందించనుంది. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను నిలువరించడానికి కూడా అమెరికా మద్దతు భారత్‌కు లభిస్తుంది.