calender_icon.png 19 October, 2024 | 3:49 AM

గిఫ్ట్‌గా ఏమిస్తుందో?

28-07-2024 12:05:00 AM

అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన వాళ్లలో శ్రీలీల ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ అమ్మడికి డ్యాన్స్ అదనపు ట్యాలెంట్. తనదైన ప్రతిభతో అవకాశాలను చేజిక్కించుకోవటమే కాదు, అభిమానులకు టచ్‌లో ఉంటూ వారి ప్రేమను పొందటమెలాగో కూడా ఈ అమ్మడికి బాగా తెలుసు. ఇటీవల షూటింగ్‌లు, ఫొటోషూట్ల కారణంగా అభిమానులను మిస్సవుతున్న ఫీలింగ్ కలిగిందో ఏమో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టడం ద్వారా ఫాలోవర్ల బుర్రకు పనిపెట్టిందీ భామ. ఓ షూటింగ్ స్పాట్‌లోని మానిటర్‌లో తాను కనిపిస్తున్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

‘క్విజ్ టైమ్.. నేను ఏ షూటింగ్‌లో ఉన్నానో చెప్పుకోండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’లో కథానాయిక శ్రీలీలేనని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో నీరా వాసుదేవ్ పాత్రలో కనిపించనుంది శ్రీలీల. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, గెలిచినవారికి ఏమిస్తుందో చెప్పకపోయినప్పటికీ శ్రీలీల పెట్టిన క్విజ్‌లో అందరూ యాక్టివ్‌గా పాల్గొంటూ అభిమానం చాటుతున్నారు. ‘రాబిన్‌హుడ్’ అంటూ రిప్లు ఇస్తున్నారు.