calender_icon.png 3 March, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రమిది

03-03-2025 12:51:19 AM

రాంప్రసాద్, జెమినీ సురేశ్, కిరీటి, సాయిప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ అనిర్వేశ్’. గంగా సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో శివాజీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘రాంప్రసాద్ విభిన్న పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్‌లో మెప్పించనున్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా దీన్ని ప్రేక్షకులు గుర్తుంచుకుంటా రనిపిస్తోంది’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘జబర్దస్త్ రాంప్రసాద్ వంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్‌గా అనిపిం చింది.

ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కెమెరామెన్ వీఆర్‌కే నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ, తారాగణమే కారణం’ అని చెప్పారు. ‘మార్చి 7వ తారీఖున చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’ అని నిర్మాత వెంకటేశ్వర్లు తెలిపారు.