calender_icon.png 16 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ గొప్పగా చెప్పుకునే చిత్రమిది

16-03-2025 01:42:04 AM

సప్తగిరి హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘పెళ్లికానిప్రసాద్’. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవై బాబు, భాను ప్రకాశ్‌గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానున్న సందర్భంగా మూవీటీమ్ విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం మాకు మేము ఒక పరీక్ష రాసుకున్నాం. నా మనస్సాక్షిగా వంద శాతం మంచి మార్కులు వేసుకున్నా.

ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు పడతాయని ఆశిస్తున్నా. తన గురించి అందరూ గొప్పగా మాట్లాడేలా డైరెక్టర్ అభిలాష్‌రెడ్డి సినిమా తీశారు. ఎస్‌వీసీ లాంటి గొప్ప బ్యానర్‌లో ఈ సినిమా రిలీజ్ కావడం మా అదృష్టం” అన్నారు.  ప్రియాం క శర్మ మాట్లాడుతూ.. ‘కామెడియన్ సరసన హీరోయిన్‌గా నటించడం కొంచెం నర్వస్‌గానే ఫీలయ్యా. అయినా ఇదో ఫన్ ఎక్స్‌పీరి యన్స్’ అన్నారు. ‘ఈ సినిమా కడుపుబ్బా నవ్వేలా ఉంటుంది’ అని నటి అన్నపూర్ణమ్మ అన్నారు. నాకు ఈ సినిమా మంచి మైలేజ్ ఇస్తుందని ప్రమోదిని చెప్పారు.